ఎండా కాలం మహారాష్ట్రలోని పైఠణ్ పట్టణ వాసులకు బంగారం తదితర విలువైన వస్తువులను కానుకలుగా ప్రసాదించే సమయం! ఇక్కడ గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడల్లా ఈ పవిత్ర పట్టణం, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వలలు, జల్లెడలు పట్టుకొని నదిలోకి వరుస కడతారు. నదిని జల్లెడ పట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటారు. ఈ నెల 23న స్థానికులు ఇలా బంగారం వేటను ప్రారంభించారు.
స్థానికులు తమ బంధువుల అంత్యక్రియలను ఈ నది ఒడ్డునే నిర్వహించి వారికి సంబంధించిన బంగారం, విలువైన వస్తువులను నదికి అర్పిస్తుంటారు. వేసవిలో నదీ ప్రవాహం తగ్గినప్పుడు గతంలో నదికి సమర్పించిన బంగారం, విలువైన కానుకలు, నాణేల కోసం నదిని ఇలా జల్లెడ పడుతుంటారు. ఏటా ఇలా చేస్తుంటారు.