MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ సంస్కృతి ఆధ్వర్యంలో వైభవంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డున పల్లె వాతావరణం సృష్టించి భోగి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భోగి అంటేనే ప్రతికూలతను వదిలిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి. మన సంస్కృతిని ముందు తరాలకు అందించేందుకు పండుగలే వారధి అని కవిత పేర్కొన్నారు.
ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరిని అలరించాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. చిన్నారులను భోగి పండ్లతో కవిత ఆశీర్వదించారు.
Participated in the Bhogi celebrations organized by @TJagruthi Telangana Jagruthi at KBR Park, Hyderabad.
Wishing you and your family a very happy and prosperous Bhogi! May this festival bring warmth, happiness, and new beginnings to all #Bhogi #bhogi2025 pic.twitter.com/N04Wpo6A2N
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 13, 2025
ఇవి కూడా చదవండి..
KCR | రైతులు.. వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి: కేసీఆర్
Bhogi | పల్లెల్లో పొంగల్ సందడి.. వీధుల్లో భోగి మంటలు, రంగవల్లులు