N. Kiran Kumar Reddy | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ):దివంగత సీఎం వైఎస్ రా జశేఖర్‌రెడ్డి బతికు న్నా.. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటు మాత్రం ఆగేది కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం బీజేపీ నాయకునిగా ఉన్న ఆ యన ఆదివారం విజయవాడలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 200 9 ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ హైకమాండ్ తమ ముందు తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదన పెట్టిందని వెల్లడించారు. తాము దానిని వ్యతిరేకించామని, అయితే వైఎస్ మరణం తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటు విషయం లో కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూలంగానే ఉన్నదని తెలిపారు. తెలంగాణ ఏ ర్పాటును అడ్డుకోలేకపోయారన్న అపప్రధ తనపై సరికాదని, వైఎస్ ఉన్నా అడ్డుకోలేకపోయేవారని అన్నారు.