BRS Party | హైదరాబాద్ : పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో సాగు, తాగునీటికి కష్టాల్లేవు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందించి.. తెలంగాణ దాహార్తిని తీర్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు, హాస్టళ్లకు కూడా మంచి నీళ్లు అందించింది నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్. విద్యార్థులకు ఏనాడు కూడా నీటి కష్టాలను రానివ్వలేదు అపర భగీరథుడు కేసీఆర్. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగునీటితో పాటు ఇతర అవసరాలకు వినియోగించే నీళ్ల కోసం చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నీటి కష్టాలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
కాంగ్రెస్ పాలన అంటేనే కష్టాలు.. కన్నీళ్ళు అని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. రాజస్థాన్లో కనిపించే దృశ్యాలు..
రాష్ట్రంలో చూడాల్సి రావడం సిగ్గుచేటు అని మండిపడింది. పాఠశాల గదిలో పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థినులు ప్రతినిత్యం గంటల తరబడి బకెట్లతో బారులుతీరితే ఇక వారి చదువులు సాగేదెలా..? అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది.
రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన పద్ధతి ఇదేనా..?కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..? నీళ్ల కోసం ఇంతటి నరకం చూపిస్తున్న కాంగ్రెస్ పాలకులను ఈ పిల్లలే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఎప్పటికీ క్షమించరు అని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.
కాంగ్రెస్ అంటేనే కష్టాలు.. కన్నీళ్ళు
రాజస్థాన్ లో కనిపించే దృశ్యాలు..
రాష్ట్రంలో చూడాల్సి రావడం సిగ్గుచేటు..!పాఠశాల గదిలో పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థినులు ప్రతినిత్యం గంటల తరబడి బకెట్లతో బారులుతీరితే ఇక వారి చదువులు సాగేదెలా❓
రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన… pic.twitter.com/fJnZQw9EA8
— BRS Party (@BRSparty) September 26, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
KTR | బీజేపీ, కాంగ్రెస్ ఒక నాణేనికి రెండు ముఖల్లాంటివి.. కపిల్ సిబల్కు కేటీఆర్ కౌంటర్
Harish Rao | తెలంగాణ వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయం.. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలన: హరీశ్ రావు