KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కపిల్ సిబల్ వైఖరి చూస్తుంటే గురివింద గింజ మాదిరిగా ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని, అందుకు ఎమ్మెల్యేల కొనుగోలు, పదో షెడ్యూల్‌ను దుర్వినియోగం చేయడం, సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటుందని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ధర్మానికి ఆదర్శం కాదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక నాణేనికి రెండు ముఖాలు అని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ అవలంభిస్తున్న పద్ధతులను తెలంగాణలో కాంగ్రెస్ ఫాలో అవుతుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు. టెన్త్ షెడ్యూల్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసు, విజిలెన్స్ దాడులతో భయాన్ని కలిగిస్తున్నారు. సీఎం భారీ అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నేతలు రాజ్యాంగాన్ని నిర్దాక్షిణ్యంగా తుంగలో తొక్కుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం రాజ్యాంగం పట్టుకుని ఫోజులిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
Mr. Sibal,
Congress is No paragon of Virtue. BJP & Congress are two sides of the same coin
Same story in Telangana
1) Luring BRS MLAs
2) Abusing Tenth Schedule
3) Instilling fear (Police, Vigilance)
4) Massive Corruption by CMAnd @RahulGandhi Ji continues to pose with… https://t.co/EN5h917gbt
— KTR (@KTRBRS) September 26, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ రాగానే.. తెలంగాణ రైతును చుట్టుముడుతున్న సమైక్యరాష్ట్రం నాటి కష్టాలు: కేటీఆర్
KTR | రెండు చీరలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఏమై పోయావ్.. బతుకమ్మ చీరల బంద్‌పై కేటీఆర్ ఫైర్
Harish Rao | తెలంగాణ వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయం.. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలన: హరీశ్ రావు