హైదరాబాద్: పదేండ్లపాటు సంతోషంగా సాగిన వ్యవసాయం.. కాంగ్రెస్ రాగానే సంక్షోభంగా మారిందనడానికి ప్రతినిత్యం రాష్ట్రంలో జరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యలే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు రక్షణ వలయంగా అమలుచేసిన పథకాలను ఒక్కొక్కటిగా పాతరేసిన కాంగ్రెస్ సర్కారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఎగ్గొట్టడం వల్లే రైతన్న బతుకుకు భరోసా లేకుండా పోయిందన్నారు.
పంజాబ్నే తలదన్ని దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతును మళ్లీ సమైక్యరాష్ట్రం నాటి కష్టాలు చుట్టుముడుతున్నాయని వాపోయారు. ముందుచూపు లేని ముఖ్యమంత్రి, వ్యవసాయ రంగంపై అవగాహన లేని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత పాలిట శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే ఇవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వం చేస్తున్న హత్యలే.. ఇప్పటికైనా వీటికి అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న రైతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.
పదేళ్లపాటు సంతోషంగా సాగిన వ్యవసాయం.. కాంగ్రెస్ రాగానే సంక్షోభంగా మారిందనడానికి ప్రతినిత్యం రాష్ట్రంలో జరుగుతున్న అన్నదాతల ఆత్మహత్యలే నిదర్శనం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు రక్షణ వలయంగా అమలుచేసిన పథకాలను ఒక్కొక్కటిగా పాతరేసిన కాంగ్రెస్ సర్కారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా… pic.twitter.com/ByD0rATz3S
— KTR (@KTRBRS) September 26, 2024