హైదరాబాద్: తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. పంటల సాగులో తెలంగాణ మేటి అన్నారు. దేశానికే మన తెలంగాణ ఆదర్శమని చెప్పారు. ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరిగింది కాదని తెలిపారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ కృషి, పట్టుదల, విజనరీ లీడర్షిప్ వల్ల సాధించిన ఘనత ఇదని ఎక్స్ వేదికగా చెప్పారు.
Telangana stood at No.1 in rice production and No.3 in cotton production for the year 2023-24.
This achievement didn’t happen overnight – it’s KCR garu’s unwavering dedication to agriculture and irrigation that made it possible!
The Congress government is merely riding on KCR… pic.twitter.com/t7v0hNTMws
— Harish Rao Thanneeru (@BRSHarish) September 26, 2024