KTR | ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
KTR | ఆరు గ్యారెంటీల పేరుతో అబద్దపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ ఒక్క కొత్త పథకం కానీ, ప్రాజెక్టును కానీ ప్రారంభించకుండా.. ఇచ్చిన హామీలను మరిచి ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఉద్దేశించి.. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
KTR | హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల పేరుతో అబద్దపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ ఒక్క కొత్త పథకం కానీ, ప్రాజెక్టును కానీ ప్రారంభించకుండా.. ఇచ్చిన హామీలను మరిచి ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఉద్దేశించి.. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం.. ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు. నూరు రోజులు, ఆరు గ్యారెంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్ లైన్ మేనేజ్మెంట్ చేయడం. గత ప్రభుత్వం ఇచ్చిన 30వేల ఉద్యోగాలు మనమే ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం. గతంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టలేదు అని చిల్లర మాటలు మాట్లాడి, ఇప్పుడు పదిహేను వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మనమే కట్టినట్టు ఫోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగా అని కేటీఆర్ అడిగారు.
అర్హతలు లేని బావమరిది కంపెనీకి వేల కోట్ల ప్రజా సొమ్ము కట్టబెట్టడం. కుటుంబపాలన అని విమర్శించి, ఇదివరకు అడ్రస్ లేని తన అన్నదమ్ముళ్లు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని మభ్యపెట్టడం. తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ బాసులకు దారాదత్తం చేయడం. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, తర్వాత చేరలేదని బుకాయించడం. ఫార్మా సిటీ రద్దు అని బయట చెప్పడం, హైకోర్టులో మాత్రం రద్దు చేయలేదు అని న్యాయమూర్తులను కూడా మోసం చేయడం. ఇష్టారీతిన పేదల ఇండ్లు కూల్చడం, బ్రదర్ ఇల్లు మాత్రం ముట్టకపోవడం.. ఇవన్నీ ఇన్నోవేటివ్ థింకింగా అని కేటీఆర్ అడిగారు. ఇంకా చాలా ఉన్నాయ్ చెప్పాలి అంటే అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి ?
✳️ ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం
✳️ నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా…
— KTR (@KTRBRS) September 26, 2024
ఇవి కూడా చదవండి..
KTR | బీజేపీ, కాంగ్రెస్ ఒక నాణేనికి రెండు ముఖల్లాంటివి.. కపిల్ సిబల్‌కు కేటీఆర్ కౌంటర్
KTR | రెండు చీరలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఏమై పోయావ్.. బతుకమ్మ చీరల బంద్‌పై కేటీఆర్ ఫైర్
KTR | రేవంత్.. రైతులకు క్షమాపణలు చెప్పండి.. కోదాడ రూరల్ సీఐని సస్పెండ్ చేయండి: కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

