హైదరాబాద్: రైతులకు సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు, తీరా అధికారంలోకి వచ్చాక… రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా అని ప్రశ్నించారు. రూ. లక్ష రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా అని ఎక్స్ వేదికగా నిలదీశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం చేసిన పొరపాటుకు రైతులను కరడుగట్టిన నేరస్థుళ్లా చూస్తున్నందుకుగాను ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చేప్పాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన మీరు.. వాటిని అమలుచేయాలని కోరాడానికి వచ్చిన రైతులను అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోదాడ రూరల్ సీఐ రజితా రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మీకు అన్నం పెట్టే చేతులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండంటూ చురకలంటించారు.
తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు…
తీరా అధికారంలోకి వచ్చాక… రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా?
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన…?
I demand… pic.twitter.com/qjl6dfmNhh
— KTR (@KTRBRS) September 26, 2024
అన్నం పెట్టే అన్నదాతపై పోలీస్ జులూమ్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒకరు దర్వాజాలు పీకుతారు.. మరోకరు కేసులు పేట్టి లోపలేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాఫీ కాలేదు మాఫీ చెయ్యండి మొర్రో అంటూ రైతులు నానా తంటాలు పడుతుంటే మరో వైపు కేసులు పెడతాం అంటూ పోలీసుల బెదిరిస్తున్నారని చెప్పారు. కేసులు పెట్టి లక్ష ఖర్చయ్యేదాకా తిప్పుదామని అన్నదాతపై పోలీసుల దాష్టీకాలంటూ విమర్శించారు. రుణమాఫీపై శృతి గతి లేని మాటలతో ఇప్పటికే సర్కార్.. రైతుల ఊసురు పోసుకుంటే, అధికారుల అతి అన్నదాతలను మరింత అగాధంలోకి నెట్టుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ పాలకులారా అంటూ హెచ్చరించారు.
అన్నం పెట్టే అన్నదాతపై పోలీస్ జులూమ్
ఒకరు దర్వాజాలు పీకుతారు-మరోకరు కేసులు పేట్టి లోపలేస్తాం అంటారు
మాఫీ కాలేదు మాఫీ చెయ్యండి మొర్రో అంటూ రైతులు నానా తంటాలు పడుతుంటే మరో వైపు కేసులు పెడతాం అంటూ పోలీసుల బెదిరింపులు
కేసులు పెట్టి లక్ష ఖర్చయ్యేదాకా తిప్పుదాం అని అన్నదాతపై… pic.twitter.com/8Oncs1rT6X
— KTR (@KTRBRS) September 26, 2024
రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చెయ్యలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే.. ఓ పోలీస్ అధికారి తన ప్రతాపం చూపారు. ‘రైతులందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి.. లక్ష రూపాయలు ఖర్చయ్యే తిరుగుతరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన 42 మంది రైతులు తమకు అన్ని అర్హతలున్నప్పటికీ రుణమాఫీ కాలేదని బుధవారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారులు ఆన్లైన్లో తప్పులు చేయడంతో తమకు రుణమాఫీ కాలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
రుణమాఫీ కాలేదంటే అధికారులకు చెప్పాలే గానీ ఆఫీసుకు తాళం వేస్తారా అంటూ సీరియస్ అయ్యారు. ‘రూ.లక్ష రుణమాఫీ కోసం ఆందోళన చేస్తారా? ఇది ఏం నిరసన? అందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి. లక్ష రూపాయలు ఖర్చయ్యే తిరుగతరు’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. తమకు అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో నిరసన తెలిపేందుకు వస్తే.. పోలీసులు కేసుల పేరుతో భయపెట్టడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
CI Rajitha Reddy | కేసు పెడితే లక్ష ఖర్చయ్యే దాకా తిరుగుతరు.. రుణమాఫీ అడిగిన రైతులపై సీఐ రుబాబు