Satyavathi Rathod | హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల కోడలినంటూ చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు.
విభజన చట్టం హామీలు నెరవేర్చడం కేంద్రం భాద్యత. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడుతున్న సీతారామన్ మోదీ వచ్చాక పెరిగిన అప్పుల గురించి మాట్లాడరా..? కేసీఆర్ అప్పులు తెచ్చి పేదల బతుకులు మారిస్తే.. మోదీ మాత్రం బడా బాబులకు మేలు చేశాడు. సీతారామన్ బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు తరలించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి సీతారామన్ ఎందుకు మాట్లాడలేదు..? అని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.
ఒక్క ములుగు నియోజకవర్గంలోనే కేసీఆర్ పది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ మీద సీతారామన్ నిందలు వేయడం మానుకోవాలి. తెలంగాణను చిన్నగా చేసి చూపిస్తే సీతారామన్ పెద్దగా అయిపోరు. గిరిజన విశ్వవిద్యాలయానికి ఎన్నికలకు ముందు శంఖుస్థాపన చేసినా పనులు ముందుకు సాగడం లేదు. సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలని బీజేపీ ఎంపీలు ఇప్పుడు కోరుతున్నారు.. ఇన్ని రోజులు ఏం చేశారు? ఢిల్లీలో సేవాలాల్ మహారాజ్ భవన్‌ను కట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Maoists Dump | ఏవోబీలో మావోయిస్టులు అమర్చిన డంప్‌లు స్వాధీనం
Harish Rao | గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి.. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్