Maoists Dump | హైదరాబాద్ : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన డంప్‌లను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డంప్‌లో బాంబులు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, ఎస్‌ఎంబీఎల్ తుపాకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
5 కిలోల బరువైన ప్రెషర్ బాంబ్, 5 టిఫిన్ ఐఈడీ బాంబులు, 3 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్లు, 2 ఎస్‌ఎంబీఎల్ తుపాకులు ఉన్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేసినట్లు మల్కాన్‌గిరి పోలీసు కార్యాలయం ప్రకటించింది. అయితే ఏవోబీలో మావోయిస్టులు నాలుగు చోట్ల డంప్‌లు అమర్చినట్లు పేర్కొంది. భారీగా డంప్ లభ్యమైన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.