Harish Rao | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు తెచ్చి మా నెత్తిన వేయకండి అని స్థానికులు విజ్ఞప్తి చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నది. పర్యావరణం దెబ్బతింటది, నర్సాపుర్ చెరువు కలుషితం అవుతుంది, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు గతంలోనే ఈ పనులను ఆపాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వెళ్తున్నది. రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నడు.. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నడు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదు. గుమ్మడిదల రైతులు అందరికి ఆదర్శం. బంగారం వంటి పంటలు పండిస్తారు.
తక్షణమే డంపు యార్డు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి వచ్చాక లగచర్ల భూములు గుంజుకున్నడు. న్యాల్కల్లో పచ్చటి పొలాలు గుంజుకునే ప్రయత్నం చేసాడు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అన్నడు.. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నడు. ఊళ్లలో మంది ఎంత మంది ఉంటే అంత మంది పోలీసులను పెట్టిండు. ఓట్లేసిన పాపానికి ప్రజలను మోసం చేశాడు. రుణమాఫీ, రైతు బంధు, మహాలక్ష్మి, ఇలా అన్నీ మోసమే. గుమ్మడిదల రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
తప్పకుండా అసెంబ్లీ వేదికగా మీ తరపున పోరాటం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఎయిర్ ఫోర్స్ వాళ్లు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవడం లేదు. టిప్పర్లు, పోలీసులను వెనక్కి తీసుకోండి. ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోండి. కళ్లు తెరవకుంటే తగిన శాస్తి తప్పదు, చేతిలో అధికారం ఉందని బలవంతంగా పని చేయకు, రెండు సార్లు హైకోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆపాలని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హెచ్చరిస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nallagonda | కలకలం.. అక్కంపల్లి రిజర్వాయర్‌లో మృతి చెందిన కోళ్లు..!
Minister Seethakka | నువ్వు మంత్రివైతే మాకేంది.. సీతక్కపై భక్తుల ఆగ్రహం..
KCR | రైతు బంధువు కేసీఆర్‌కు పుష్పాభిషేకం..