Minister Seethakka | మినీ మేడారం జాతరకు వెళ్లిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రావడంతో ప్రోటోకాల్ పేరిట గంటల కొద్ది భక్తులను ఎండలో నిలబెట్టారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నువ్వు మంత్రివైతే మాకేంది, నువ్వు దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఎంతసేపు ఆపుతావు! అంటూ సీతక్కపై భక్తులు నిప్పులు చెరిగారు. తాము గంటల కొద్ది ఎండలో నిలబడి పోవాలా..? అంటూ నిలదీశారు. భక్తులకు త్వరగా దర్శనం కల్పించాల్సింది పోయి.. క్యూ లైన్లలో గంటల తరబడి నిలిపి ఉంచడం సరికాదని మండిపడ్డారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా.. అదే సమయంలో ప్రోటోకాల్ పేరిట ఆటంకం కల్పించడం సరైన చర్య కాదని ఆగ్రహం వెలిబుచ్చారు.