MLC Kavitha | హైదరాబాద్ : దేశానికి వెలుగులు పంచడం కోసం తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిలో అహర్నిశలు పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గత 23 సంవత్సరాలుగా కార్మికుల పక్షాన నిబద్ధతతో, చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక కార్మిక సంఘం టీబీజీకేఎస్. కేసీఆర్ మార్గ నిర్దేశకత్వంలో తెలంగాణ ఉద్యమంతో సహా అనేక ప్రజా పోరాటాలు చేపట్టింది అని కవిత పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి సంస్థను పరిరక్షించుకోవడమే ధ్యేయంగా టీబీజీకేఎస్ పనిచేస్తోంది. ముఖ్యంగా సింగరేణి ప్రైవేటీకరణకు, బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. తెలంగాణలోని గోదావరి లోయలో ఉన్న బొగ్గు గనులన్నింటిని సింగరేణి సంస్థకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Suryapeta | ఆర్నేళ్ల కింద ప్రేమ వివాహం.. యువకుడి దారుణ హత్య