MLA Sabitha | హైదరాబాద్ : మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, నేడు సిరిసిల్ల, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్లలో ఆందోళన చేస్తున్న పోలీసు కానిస్టేబుల్ భార్యల ఆవేదన.. అరణ్య రోదనేనా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మూడు రోజులుగా వివిధ బెటాలియన్లలో పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు చేస్తున్న ఆందోళన ప్రభుత్వానికి పట్టదా..? అని ఆమె నిలదీశారు.
పోలీసు విధులు కాకుండా కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారంటూ.. ఆయా బెటాలియన్ల ముందు పోలీసుల భార్యలు ఆందోళనకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని సబితా మండిపడ్డారు. భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేస్తారా? పోలీసుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకొంటోంది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏక్ పోలీస్ నినాదం ఏమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని, రోడ్డెక్కిన ఆడబిడ్డల గోడును పరిష్కరించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ లుచ్చాగాళ్లకు ఓట్లేయొద్దని మహారాష్ట్రలో చెప్పండి : కేటీఆర్
KTR | ఏడో బెటాలియన్లో కానిస్టేబుళ్ల భార్యల ఆందోళన.. సంఘీభావం ప్రకటించిన కేటీఆర్
KTR | సింగరేణి మీద అదానీ కన్ను.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు