KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల కోసమే రైతు భరోసాను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకువస్తున్నాడని కేటీఆర్ తెలిపారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు రైతుల కోసం మా పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగానే ఈరోజు మొదటి రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము. 21వ తేదీన నల్లగొండలో రైతు ధర్నా ఉంటుంది. స్థానిక సంస్థల కోసం రైతు భరోసా పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రైతు భరోసాను కాంగ్రెస్ ఎత్తివేస్తుంది. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 22 లక్షల మంది గురించి మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట ప్రతి హామీని నిలబెట్టుకోవాలి అప్పటిదాకా కాంగ్రెస్‌ను వదిలిపెట్టము. రైతులకు, వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు. రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు, సాగునీరు వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను కేసీఆర్ తీసుకువచ్చారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
మా పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న రైతన్నల కోసం నిరంతరం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తూనే ఉంటాము. విచారణల పేరుతో ఎంత డైవర్షన్లు చేసినా మా పోరాటం ఆపము. మళ్లీ చెబుతున్నాను రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కానీ ఇంకెక్కడైనా లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షకు రావాలి. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలి. తనపై కేసు వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం కుమ్మరిస్తున్నది. మాపై చేసే వేధింపుల కోసం ప్రజల సొమ్మును దండగ చేయడం ఎందుకు..? ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం దమ్ముంటే రేవంత్ రెడ్డి రావాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు వృధా చేసింది.. ఈ డబ్బులతో వందల మంది రైతన్నలకు, వృద్ధులకు ఆర్థిక భరోసా అందించవచ్చు. కేవలం ఐదు పది లక్షల రూపాయలతో లైవ్‌లో డిబేట్ పెట్టి లై డిటెక్టర్ పెడితే ఎవరు తప్పు చేశారో తెలిసిపోతుంది కదా..? ఏమీ లేనటువంటి ఏసీబీ కేసును ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం వాడుకుంటుంది.
ఏసీబీ, ఈడీ చేసిన విచారణలో ఎలాంటి అవినీతి లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. గ్రీన్ కో కంపెనీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వలన ఒక రూపాయి అయినా లాభం జరిగిందా..? ఆ కంపెనీకి ఎలాంటి లబ్ధి చేయనప్పుడు క్విడ్ ప్రోకో అని మాట ఎలా వర్తిస్తుంది? ప్రభుత్వము ఖర్చు చేసిన 46 కోట్లలో నయ పైసా అయినా మాకు వచ్చిందా..? ఆ రేసు రద్దు వలన ప్రభుత్వానికీ నష్టం జరిగింది. ఒక్క ఏడాది పాటు డబ్బులు వెనక్కి తేవడానికి ఏం చేసారు..? గతంలో చెప్పినట్లు మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్నాను.. దానికి కట్టుబడి ఉన్నాను అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణలో ఆలీబాబా అరడజన్ దొంగల పాలన.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
Free Bus | ఫ్రీ బస్సు పేరుతో మగపిల్లలకు ఇజ్జత్ లేకుండా చేసిండు.. రేవంత్‌పై మండిపడ్డ మహిళ