Free Bus | రంగారెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై రాష్ట్రంలోని మహిళలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే తమకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడమే. ఒక్క ఫ్రీ బస్సు అమలు చేసి.. బస్సుల్లో కొట్లాటలు పెట్టాడని రేవంత్ సర్కార్‌పై మహిళలు నిప్పులు చెరుగుతున్నారు.
ఇవాళ రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు ధర్నా సభలో ఓ మహిళా రైతు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది.. క్రాప్ లోన్ రూ. 54 వేలు తీసుకున్నాను.. కానీ రుణమాఫీ కాలేదు నాకు. అందరికీ రుణమాఫీ అయిందని ముఖ్యమంత్రి అబద్ధం చెబుతున్నాడు. అందరికీ మాఫీ అయింది కానీ మాకు కాలేదు. రూ. 500కే గ్యాస్ అన్నాడు.. కానీ రూ. 900 తీసుకుంటున్నరు. తిరిగి రూ. 400 మా ఖాతాలో పడట్లేదు. రైతుబంధు కూడా రాలేదు. ఫ్రీ బస్సులో పోతలేను. అది ఒక్కటి నడుస్తున్నది. తులం బంగారంలేదు. రూ. 2500 లేవు. మా ఆయనకు కేసీఆర్ 2 వేల పెన్షన్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ నాలుగు వేల పెన్షన్ ఎక్కడ పోయిందో. పుల్ల గీసి అంటుపెట్టాలి.. మరి ఏం మంచిగ జేస్తుండు.. ఫ్రీ బస్సు అని మగపిల్లలకు ఇజ్జత్ లేకుండా చేసిండు. అది పద్ధతి కాదు అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై మహిళా రైతు చెన్నమ్మ రుసరుసలాడారు.
రుణమాఫీ, ఇతర మోసాలపై కాంగ్రెస్ సర్కార్ ను నిలదీసిన మహిళా రైతు చెన్నమ్మ
📍షాబాద్, చేవెళ్ల రైతు మహా ధర్నా. pic.twitter.com/kiwVQyUSnj
— BRS Party (@BRSparty) January 17, 2025
ఇవి కూడా చదవండి..
KTR | చేవెళ్లలో త్వరలోనే ఉప ఎన్నిక.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | 37 రోజులు కాదు.. దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. సీఎం రేవంత్‌కు తేల్చిచెప్పిన కేటీఆర్