KTR | రంగారెడ్డి : 37 రోజులు కాదు దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. భయపడేటోడు ఎవడూ లేడు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కానీ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే వెంటాడుతాం.. అడుగూతనే ఉంటాం. పేదల తరపున కొట్లాడుతూనే ఉంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు వస్తారు.. చేయి గుర్తుకు ఓటేయండి అని అడుగుతారు. మీ సీఎం రైతుభరోసా కింద ఎకరానికి 17500 చొప్పున బాకీ ఉన్నాడు.. ఆ డబ్బులు చెల్లిస్తే ఓట్లు వేస్తామని చెప్పండి. బాకీ ఉన్నోన్ని అడిగినట్టు గల్లా పట్టుకుని అడగాలి.. అభయ హస్తం భస్మాసుర హస్తం అయిపోందని నిలదీయాలని ఆడబిడ్డలకు, రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని మహిళలకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్. కాంగ్రెసోళ్లను నమ్మకండి అని చెప్పిండు. నెలకు 2500 పడ్డాయా..? 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయా.? కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ఈ ఏడాది 30 వేలు బాకీ ఉన్నాడు. ఓట్లు అడిగితే 30 వేలు చెల్లించి ఓట్లు అడగండి అని కాంగ్రెసోళ్లకు చెప్పండి. రేపు తప్పిదారి.. 12 వేలు ఇస్తుండుగా అని ఓట్లు వేస్తే.. మళ్లీ ఇవ్వడు. ఓట్లుప్పుడు మాత్రమే పైసలు ఇస్తడు.. సర్పంచ్ ఎన్నికలప్పుడు వేస్తడు.. మళ్లీ నాలుగేండ్ల వరకు కనిపించడు. కాబట్టి రైతుబీమా, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఎక్కడ అని నిలదీయండని రైతులకు, ఆడబిడ్డలకు కేటీఆర్ సూచించారు.
ఈ ఏడాది కాలంలో నాలుగైదు లక్షల లగ్గాలు అయ్యాయి. రేవంత్ రెడ్డికి తులం బంగారం దొరకతలేదా ..? బంగారం షాపుడో నిన్ను నమ్మడం లేదా..? పెళ్లైన ఆడబిడ్డలకు 80 వేల చొప్పున బాకీ ఉన్నాడు. సిలిండర్ ఫ్రీగా వస్తలేదు. కరెంట్ 200 యూనిట్ల ఫ్రీగా ఇవ్వడం లేదు. పచ్చి మోసగాడు.. పచ్చి అబడ్దాల కోరు సీఎం రేవంత్.. 420 కేసు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి. మనం కేసులు పెట్టినా.. పోలీసులు దరఖాస్తు తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి భయం పట్టుకుంది వాళ్లకు. అందుకే ఓట్లప్పుడే రేవంత్ రెడ్డికి చురుకు పెట్టాలని కేటీఆర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Inter Exam Fee | ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 25వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
Nagarkurnool | కల్లు సీసాలో కట్ల పాము ప్రత్యక్షం.. షాకైన బాధితుడు