Inter Exam Fee | ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 25వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
Inter Exam Fee | మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది.
Inter Exam Fee | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తం చేసింది. వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఇప్పటికీ చెల్లించని విద్యార్థులు.. ఆలస్య రుసుం రూ. 2500తో జనవరి 25వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులతో పాటు ప్రయివేటు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు అనుమతివ్వాలన్న ప్రైవేట్ కాలేజీల విజ్ఞప్తితో ఈ ఒక విద్యాసంవత్సరానికి అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 217 కాలేజీల్లోని 70 వేల మంది విద్యార్థులకు ఊరట కలిగింది.
ఈ క్రమంలో ఆ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవద్దనే ఉద్దేశంతో వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇంటర్ వార్షిక పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 5 నుంచి, సెకండియర్ విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana | ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ
Nagarkurnool | కల్లు సీసాలో కట్ల పాము ప్రత్యక్షం.. షాకైన బాధితుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

