Telangana | ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ
Telangana | తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. సింగపూర్‌లోని ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.
Telangana | సింగపూర్: విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటిఈ) సంస్థతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటిఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
సింగపూర్ ఐటిఈ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటి సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణనిస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్లైన్, క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. ఐటిఈకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (yisu.in) తన శిక్షకులకు ఐటిఈతో ట్రెయినింగ్ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటిఈ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుందని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

