Congress Govt | హామీలు నెరవేర్చలేక ఆపసోపాలు.. సర్కారు భూములను అమ్మకానికి పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని ఇండ్ల స్థలాలు, అమ్ముడుపోని ఫ్లాట్లను వేలం వేస్తున్నది. తద్వారా రూ.3,500 కోట్లకు పైగా నిధుల సమీకరణకు సిద్ధమైంది.
- 3,500 కోట్ల సమీకరణకు సిద్ధం
- వేలంలో స్థలాలు, ఫ్లాట్ల విక్రయం
- వచ్చే నెలలోనే వేలం నోటిఫికేషన్
- ఆర్థికలోటును పూడ్చుకొనే యత్నం
Congress Govt | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆపసోపాలు పడుతున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని ఇండ్ల స్థలాలు, అమ్ముడుపోని ఫ్లాట్లను వేలం వేస్తున్నది. తద్వారా రూ.3,500 కోట్లకు పైగా నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈ వేలాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెలలో విడుదల కానున్నది. ఈ వేలం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో మొత్తం 1,400కు పైగా ఓపెన్ ప్లాట్లు (100-500 చదరపు గజాల మధ్య), కరీంనగర్, ఖమ్మం, గద్వాల తదితరజిల్లాల్లో అమ్మకానికి సిద్ధం చేశారు.
వీటితోపాటు ఇంకా పూర్తికాని 361 ఇండ్లు అమ్మకానికి పెట్టారు. పోచారం, బండ్లగూడ, నాగోల్ సమీపంలోని రాజీవ్ స్వగృహ గేటెడ్ టౌన్‌షిప్‌లు, జవహర్‌నగర్, గాజులరామారం తదితర ప్రాంతాల్లో ఇంకా అమ్ముడుపోని 700 ఫ్లాట్లను కాంగ్రెస్ సర్కారు అమ్మే ప్రయత్నం చేస్తున్నది. ఈ ఫ్లాట్లు 2007 నుంచి ఇప్పటివరకు అమ్ముపోకుండా ఉన్నాయి. 54 కేపీహెచ్‌బీ ఫ్లాట్లకు ఈ నెల 24న, గచ్చిబౌలి, బాలాజీనగర్, భరత్‌నగర్‌లోని ఏడు ఫ్లాట్లకు ఈ నెల 30న, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని 42 ఫ్లాట్లకు వచ్చేనెల 5న వేలం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా వాటికి ఫిబ్రవరిలో, మార్చిలో వేలం వేయనున్నట్టు తెలిసింది.
ఆర్థికలోటును పూడ్చుకొనే యత్నం
ఆర్బీఐ నుంచి అప్పుచేసినా బండి నడవకపోవడంతో ఆర్థికలోటును ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇండ్లస్థలాలు, అమ్ముడుపోని ఫ్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు రాష్ట్ర ఆదాయం రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్నది. నిరుడు ఇదే కాలంలో రూ.1.11 లక్షల కోట్లు వచ్చింది. నవంబర్ చివరి నాటికి మొత్తం ఆదాయం సుమారు రూ.1.41 లక్షల కోట్లు ఉండగా, వ్యయాలు రూ.1.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈలోగా రూ.2,621 కోట్ల రుణాలు, చెల్లింపుల కోసం ఖర్చుచేశారు. దాంతో రాష్ర్టానికి రూ.14,288 కోట్ల ఆదాయ లోటు, రూ.37,850 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. ఈ లోటును స్థలాలు, ఫ్లాట్ల వేలం ద్వారా పూడ్చుకోవాలని భావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

