KTR | ఢిల్లీలో కాదు.. దమ్ముంటే అశోక్‌నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన 420 హామీలను గంగలో కలిపి, ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండని ధ్వజమెత్తారు.
హైదారాబాద్: తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన 420 హామీలను గంగలో కలిపి, ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండని ధ్వజమెత్తారు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన దేశ రాజధానిలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి అంటూ మండిపడ్డారు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు.. ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా అని ఫైర్అయ్యారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు రేవంత్ వ్యవహారం ఉందంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘తల్లికి బువ్వ పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు.. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన.. ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ?. గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ?. నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు ?. తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు?. రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ?. ఆసరా పింఛన్లు రూ.4000 చేసిందెక్కడ?. రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ?. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ?. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నారు. ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్‌నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని. నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం’ జాగో ఢిల్లీ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు
తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు
తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన – ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి
ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? -గ్యాస్… pic.twitter.com/JhIIxXW4fw
— KTR (@KTRBRS) January 17, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

