KTR | చేవెళ్లలో త్వరలోనే ఉప ఎన్నిక.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR | రంగారెడ్డి : చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. కేసీఆర్‌కు ఓటేయడంతో ఇక్కడున్న ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకలో జొచ్చిండు. అభివృద్ధి కోసం పోయాను అని అంటుండు. ఈ ఏడాదిలో ఏం అభివృద్ధి జరిగింది..? రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా అమలైందా..? ఆడబిడ్డలకు తులం బంగారం, స్కూటీ ఇచ్చావా..? ఏం అభివృద్ధి అయింది.. ఉన్నది పీకింది. ఎన్నికలు వచ్చినప్పుడు చేవేళ్లలోనే కాదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల 10 నియోజకవర్గాల్లో బుద్ధి చెబుదాం. రైతు భరోసా వేయనందుకు, వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టినందుకు, రుణమాఫీ మోసం చేసిందుకు, ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వనందుకు, మా భూమి మాకే ఉండాలన్న పాపానికి 40 మంది రైతులను జైల్లో పెట్టి హంసించినందుకు.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం. చివరకు వృద్ధులను కూడా మోసం చేసిండు. ఆసరా పెన్షన్లు 4 వేలు ఇవ్వడం లేదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి నోటికి హద్దు లేదు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకుంటుండు. కేసీఆర్ ఇచ్చిన 44 వేల ఉద్యోగాలను నేను ఇచ్చిన అని చెప్పుకుంటూ మోసం చేస్తున్నాడు. ఇవాళ షాబాద్‌లో జరిగిన ధర్నా మొట్టమొదటి.. మిగతా చోట్ల కూడా ధర్నా చేస్తాం. 70 లక్షల మంది రైతుల పక్షాన, 22 లక్షల మంది కౌలు రైతుల పక్షాన, భూమి లేని నిరుపేదల పక్షాన అడుగుతున్నాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకో.. అందరికీ రైతుభరోసా జమ చేయ్.. లేదంటే రేపు పంచాయతీ ఎన్నికల్లో నీ వీపు చింతపండు చేస్తారు మా ఆడబిడ్డులు, రైతులు. ఇది ఆరంభం మాత్రమే.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతూనే ఉంటాం.. ఎన్ని కేసులు పెట్టినా.. జైళ్లకు పంపించినా రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | 37 రోజులు కాదు.. దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. సీఎం రేవంత్‌కు తేల్చిచెప్పిన కేటీఆర్
Inter Exam Fee | ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 25వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

