KTR | హైదరాబాద్ : కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయనకు పేపర్ లీకులు తప్ప.. గ్రూప్-1 గురించి ఏం తెలుసు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ప్రజా పాలన అని ఫోజులు కొట్టిన రేవంత్ రెడ్డి ఈ నిర్బంధం ఎందుకు తీసుకొచ్చావ్..? చర్చలు జరిపేందుకు ఎందుకు భయపడుతున్నవ్. మా నాయకులను అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నవ్.. నీ దోస్తు బండి సంజయ్‌ను బ్రహ్మాండంగా అక్కడికి పంపించావు. సకల రాచమర్యాదలతో సీఆర్పీఎఫ్ బలగాలను పెట్టి ఆయనను అక్కడికి పంపుతవ్. అదే మా నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తావు. ఇకనైనా సిగ్గు, బుద్ధి తెచ్చుకోని గ్రూప్-1 అభ్యర్థులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించండి అని కేటీఆర్ కోరారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన మంత్రి వర్గం కూల్చేస్తున్నారు.. ఐదేండ్లు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అని సీఎం తరపున బండి సంజయ్ మాట్లాడారు. ఇవాళ ఈ శిఖండి రాజకీయంలో భాగంగా బండి సంజయ్‌ను ముందరపెట్టి గ్రూప్-1 అభ్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ పరీక్ష రాసేది ఉందా..? అసలు ఆయన ఏమైనా చదువుకున్నాడా..? గ్రూప్-1 అభ్యర్థులను ఓ పది మందిని పిలిచి వారి వాదనలు వినండి. న్యాయం ఉందంటే వెంటనే వాయిదా వేయండి. బండి సంజయ్ వల్ల ఏం కాదు.. పేపర్ లీకులు చేయమంటే చేస్తడు. కానీ ఆయనకు ఈ గ్రూప్-1 గురించి ఏం తెలుసు. కాబట్టి గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు జరిపి ప్రభుత్వం విచక్షణ, విజ్ఞతతో మెలగాలని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | గ్రూప్-1 అభ్యర్థులను పశువుల మాదిరిగా చూడడం దారుణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్