RS Praveen Kumar | హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. జీవో 29 రద్దు చేశాకే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని ఆ పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలకు మద్దతుగా నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజ్ శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్‌ను సచివాలయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా జీవో 29 రద్దు చేయకుండా.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలనుకోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగ వ్యతిరేకం. అర్జెంట్‌గా జీవో 29ని రద్దు చేసి.. నాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55ని పునరుద్ధరించి పరీక్షలు నిర్వహించాలి. అప్పటిదాకా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలి. నిరుద్యోగులకు మద్దతిస్తున్నాం. కేటీఆర్ వద్దకు వచ్చి గ్రూప్-1 అభ్యర్థులు తమ బాధలను విన్నవించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సమస్యను పరిష్కరించడం చేతగాక.. గ్రూప్-1 అభ్యర్థుల వెనుకాల రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పడం సరికాదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. జీవో 29 రద్దు చేసి.. పరీక్షలు నిర్వహించాలి. అన్ని వర్గాలకు, కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం : హరీశ్‌రావు