KTR | హైదరాబాద్ : కొడంగల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు కారణంగా.. సురేశ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త 7 ఎకరాల భూమి పోతోంది.. విలువైన భూమి పోతదంటే అడగడం తప్పా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. కొడంగల్లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ అభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు రైతుల బాధలను ఆయనకు చెప్పాడు. ఎక్కడ కూడా దాడి చేయలేదు. సురేష్ దాడికి పాల్పడినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సురేష్ అసలు దాడియే చేయలేదు. కడుపు మండి తన భూమి గురించి అడిగాడు. కలెక్టర్కు అక్కడి రైతుల సమస్యను వివరించాడు. మా పార్టీ నాయకులు మా వారితో మాట్లాడితే అది కూడా తప్పా? దానికి కేసులు పెడతారా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతుక అనే కదా నువ్వు కూడా గెలిచింది. మరీ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. రైతులు తమ భూములు కాపాడాలని కోరుతూ అందరినీ కలిశారు. ముఖ్యమంత్రి బిజీగా ఉండటంతో ఆయన సోదరుడిని కూడా కలిశారు. నీ ఆనాలోచిత విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? సురేష్ నాతో వచ్చి కలవటమే తప్పు అయితే రాహుల్ గాంధీ వ్యతిరేకించే అదానీతో రేవంత్ రెడ్డి రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. మరి దానికి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలి కదా? సురేష్ ఏం తప్పు చేశాడు. మన నాయకులతో మాట్లాడటమే తప్పా? ఆయన భూమి పోతుంటే మాట్లాడకూడదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
KTR | అల్లుడి కంపెనీ కోసం.. రైతులపై రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు..! కేటీఆర్ ధ్వజం
KTR | ముందుచూపుతోనే ముచ్చర్లలో ఫార్మా సిటీ : కేటీఆర్