నిడమనూరు, ఫిబ్రవరి 20 : నిడమనూరు మండల కేంద్రంలోని శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో గణపతి పూజ, ఉత్సవ మూర్తులకు అభిషేక పూజలు, గంగా స్నానం శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆచరింపజేశారు. అనంతరం చలువ పందిళ్ల నీడలో గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రస్వామి వార్లకు మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వేద పండితులు కల్యాణోత్సవ తంతును చేపట్టారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం
నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, గ్రామ పంచాయతీ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ విశ్వనాధుల రాణి రమేశ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కుబడులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి, ఏజీపీ ఉన్నం చిన్నవీరయ్య, తుమ్మడం గ్రామ పంచాయతీ సర్పంచ్ బుర్రి వెంకన్న, తుడుమిళ్ల రాములు, విశ్వనాధుల బ్రహ్మచారి, బొల్లం బాలయ్య, మెరుగు మధు, మంగినపల్లి వెంకటయ్య, అనుముల నరసింహా చారి, జ్ఞానేశ్వరాచారి పాల్గొన్నారు.

కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం