Harish Rao : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) తీవ్రంగా విమర్శించారు. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన ‘రైతు బంధు’ నిధులను ఇంకా విడుదల చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన రైతు బంధు ఎప్పుడిస్తారు? అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
‘మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే 17వ తేదీన రైతుబంధు ఇస్తా అన్నాడు, 20వ తేదీ వచ్చింది. అయినా ఇంకా రైతుబంధు రాలేదు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తారా?.. కోతలు జరిగేటప్పుడు ఇస్తారా?’ అని రేవంత్‌ను హరీశ్ సూటిగా ప్రశ్నించారు. ‘ఇప్పటికే రెండు పంటలకు రైతు బంధు వేయలేదు, ఈ సారి అయినా వేస్తారా లేదా? బడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం రూ.20వేల కోట్ల బకాయిలు చెల్లించావు కానీ రైతులకు రైతుబంధు వేయడానికి డబ్బులు లేవా?’ అని కాంగ్రస్ సర్కార్ దాటవేత ధోరణిపై హరీష్ రావు ధ్వజమెత్తారు.
మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే 17వ తేదీన రైతుబంధు ఇస్తా అన్నాడు, 20వ తేదీ వచ్చింది ఇంకా రైతుబంధు రాలేదు
రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తారా కోతలు జరిగేటప్పుడు ఇస్తారా?
ఇప్పటికే రెండు పంటలకు రైతుబంధు వేయలేదు, ఈ సారి అయినా వేస్తారా లేదా?
బడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం… https://t.co/WJPm3u4SuI pic.twitter.com/VpHb5vq7If
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026