INDWA vs SLWA : మహిళల ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్‌లో భారత ఏ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారీ విజయంతో శ్రీలంకను ఇంటికి పంపి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ విందా దినేశ్(42), రాధా యాదవ్(32 నాటౌట్, 4-19) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో 5 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భారత ఏ జట్టు పంజా విసిరింది. లీగ్ దశలో అదరగొట్టిన టీమిండియా సెమీఫైనల్లోనూ చెలరేగిపోయింది. భారీ స్కోర్‌తో భారత్‌కు చెక్ పెట్టాలనుకున్న లంక ఆశలకు కెప్టెన్ రాధా యాదవ్ (4-19) అడ్డుకట్ట వేసింది. వికెట్ల వేటతో రెచ్చిపోగా.. ప్రత్యర్థి 118 పరుగులకే కుప్పకూలింది.
Leading from the front in the semi-final! 🫡
A complete all-round performance rom captain Radha Yadav earns her the Player of the Match!
Scorecard ▶️ https://t.co/aNr9cJmPBz#WomensRisingStarsAsiaCup pic.twitter.com/Oluejih8UT
— BCCI Women (@BCCIWomen) February 20, 2026
లంక జట్టులో ఓపెనర్లు సంజనా కవింది(31), హన్సిమ కరుణరత్నే(14)లను విడదీసి తనూజ కన్వర్ బ్రేకివ్వగా.. అక్కడి నంచి రాధా యాదవ్ తిప్పేసింది. మిడిలార్డర్‌ను పడగొట్టిన తను.. లోయర్ ఆర్డర్‌ను డగౌట్ చేర్చింది. ఆఖర్లో శశిని గుహ్మని(22) మాత్రమే రాణించగా లంక 118కి ఆలౌటయ్యింది.
ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేసి సగం విజయం సాధించిన భారత్‌కు ఓపెనర్లు నందినీ కశ్యప(14), విందా దినేశ్లో (42) అదిరే ఆరంభమిచ్చారు. వీరిద్దరూ ఔటయ్యాక క్రీజునంటుకుపోయిన రాధా యాదవ్(31 నాటౌట్) లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. అజేయంగా నిలిచి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లింది. 5 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసిన భారత్ ఆదివారం జరుగబోయే టైటిల్ పోరులో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది.