మహబూబ్‌నగర్ : క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు ( Leadership qualities ) , క్రమశిక్షణ, సమయపాలన, సహనశక్తి వంటి విలువలు పెరుగుతాయని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ( MLA Srinivas Reddy ) అన్నారు. జిల్లా క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి సీఎం కప్–2025 బాక్సింగ్ అండ్ నెట్‌బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ పెంపొందించే సాధనమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్–2025 పోటీలు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికగా నిలుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లా పేరును గర్వంగా నిలబెట్టగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గుమాల్ మమత శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కార్పొరేటర్లు ఉమర్ కొత్వాల్, సిబి శ్రీపూజి, టి.రమేష్ బాబు, నాయకులు సిజె బెనహర్, గోపాల్ యాదవ్ డీవైఎస్వో శ్రీనివాస్, క్రీడా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.