వరద తగ్గుముఖం
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఉదయం 24,784 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 5,026 క్యూసెక్కులకు పడిపోయింది.
- ఎస్సారెస్పీలో 33 టీఎంసీలు..
- నిజాంసాగర్‌లో 8.2 టీఎంసీలకు చేరిక
మోర్తాడ్/నిజాంసాగర్, ఆగస్టు 3: ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఉదయం 24,784 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 5,026 క్యూసెక్కులకు పడిపోయింది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,075.10 అడుగుల (33.137 టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా వానల్లేక చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్‌ఫ్లో రాలేదు. అయితే, భారీ వర్షాల కారణంగా ఈ సీజన్లో శనివారం అత్యధికంగా 85 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది.
నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో
నిజాంసాగర్ ప్రాజెక్టుకు వారం క్రితం మొదలైన ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. 2,550 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీ)లకు గాను ప్రస్తుతం 1,397.00 అడుగుల (8.242 టీఎంసీల) నీరు నిల్వ ఉందని ఏఈఈ సాకేత్ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

