KTR | హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం ఉందా..? లేదా..? అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలగక తప్పదు. ఎందుకంటే.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదు.. అభివృద్ధికి కూడా ఒక్క ప్రాజెక్టు నోచుకోలేదు. ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నచందంగా రేవంత్ రెడ్డి పాలన తయారైంది. ఇందుకు సాక్ష్యం.. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట ధర్నాలు, నిరసనలే.
తమకు జరుగుతున్న అన్యాయంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేయడం, విధుల నుంచి తొలగించడం, మెమోలు జారీ చేయడంతో పాటు కక్షపూరిత చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోంది. ఈ చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని రగిల్చింది ఎవరు..? అని కాంగ్రెస్ సర్కార్‌ను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. డిజిటల్ సర్వే పేరుతో ఏఈవోల మీద వేటు..! పనిభారం మీద ప్రశ్నించినందుకు పోలీసులపై వేటు..! కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యోగుల ఆగ్రహం.. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాల వల్ల కాదా..? రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలు కాదా..? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఎట్లున్న తెలంగాణ.. ఎట్లాయే అని ఇప్పుడు తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Mains | నేటితో ముగియనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు..
KTR | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం.. రైతు మహేందర్ రెడ్డి పాలిట శాపమైంది : కేటీఆర్