KTR | తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించనున్నది. ఈ కంపెనీ ప్రారంభానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కిటెక్స్ వస్త్ర పరిశ్రమ ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
అలనాటి వరంగల్ వస్త్ర వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మహత్తర కార్యం ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నల తలరాత మార్చేందుకు తీసుకున్న ఒక మెగా సంకల్పం ఇది అని తెలిపారు. పట్టుదలతో రాష్ట్రానికి పట్టుకొచ్చిన భారీ పెట్టుబడి కిటెక్స్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రపంచస్థాయి సంస్థలను ఒప్పించి.. రప్పించి కాకతీయ టెక్స్ టైల్ పార్కును కళకళలాడించేందుకు చేసిన కృఫి ఫలాలు ఇవి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఫైబర్ టూ ఫ్యాషన్ స్లోగన్‌తో వలసలు వాపస్ వచ్చేలా.. ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేలా వస్త్ర నగరిని తీర్చిదిద్దటానికి చేయని ప్రయత్నాలు లేవు. కేంద్ర సహకారం ఏమాత్రం లేకున్నా… స్వంత నిధులతో ముందడుగు వేశామని కేటీఆర్ స్పష్టం చేశారు.
2021లో పరిశ్రమను కేరళ నుంచి బయటకు తరలించాలని కిటెక్స్ సంస్థ నిర్ణయించింది. దీంతో దేశంలోని ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా తదితర 12 రాష్ర్టాలతోపాటు శ్రీలంక కూడా సదరు పరిశ్రమను తమప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించాయి. వారి ఆహ్వానంపై సంస్థ ఎండీ సాబూజాకబ్ ఆయా రాష్ర్టాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూలై 2021లో అప్పటి పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా వారిని తెలంగాణకు ఆహ్వానించారు. కరోనా లాక్డౌన్ ఉన్నందున తాను రాలేనని చెప్పడంతో ప్రత్యేక ఫ్లైట్‌ను కేరళకు పంపి ఆయనను రాష్ర్టానికి రప్పించారు. చిన్న పిల్లల బట్టల తయారీకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ పరిశ్రమ.. బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక, స్నేహపూర్వక విధానాలు, కేటీఆర్ పట్టుదలకు ఆకర్షితులై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టింది.
అలనాటి వరంగల్ వస్త్ర వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు..కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మహత్తర కార్యం ఇది !
నేతన్నల తలరాత మార్చేందుకు తీసుకున్న ఒక మెగా సంకల్పం!
పట్టుదలతో రాష్ట్రానికి పట్టుకొచ్చిన భారీ పెట్టుబడి..కిటెక్స్ !
ప్రపంచస్థాయి సంస్థలను ఒప్పించి.. రప్పించి కాకతీయ టెక్స్ టైల్… pic.twitter.com/gi1UkSEJto
— KTR (@KTRBRS) October 27, 2024
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం ఇలాకా నుంచే తిరుగుబాటు.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ప్రజల ప్రత్యర్థి కాంగ్రెస్సే : కేటీఆర్
Telangana Police | బెటాలియన్ కానిస్టేబుళ్లపై ఆర్టికల్ 311 ప్రయోగం?