KTR | హైదరాబాద్ : రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతుల గోస పుచ్చుకుంటున్నది. రైతు భరోసా ప్రస్తావనే లేదు. రుణమాఫీ పూర్తి కానే లేదు. ఇలా అనేక సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. అప్పుల బాధలు తాళలేక, పంటకు మద్దతు ధర లభించక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అన్నదాతల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం.. రైతు మహేందర్ రెడ్డి పాలిట శాపమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్లు వేసినా.. రైతులకు పాట్లు తప్పడం లేదన్నారు. కాంగ్రెస్ వచ్చి..మార్పు తెచ్చిందంటే ఏమో అనుకున్నాం.. రైతుల చేతుల్లోకి పురుగుల మందు డబ్బా తెచ్చి పెడుతుందనుకోలేదు. రైతు బంధు రాలేదు… రుణమాఫీ కాలేదు.. తెలంగాణలో బక్కచిక్కిన రైతు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. దీనికంతటికీ కారణం అబద్దాలతో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ కాదా? అని కేటీఆర్ నిలదీశారు.
ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారు? ఇంకెంతమంది రైతుల చేతుల్లో పురుగుల మంది డబ్బా పెడుతారు? రైతులకు అభయం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు చేసేందుకు మంత్రుల ఆదేశాలు.. ఇదేనా ప్రజా ప్రభుత్వం!! ఏమైంది మీ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు!! ఆరు గ్యారంటీలకు మాది పూచి అన్న గాంధీ ఫ్యామిలీ..ఈ రైతుల చావులకు బాధ్యత వహించాలి!! ఇది ఆత్మహత్య కాదు..కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్య అని కేటీఆర్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం ఇలాకా నుంచే తిరుగుబాటు.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ప్రజల ప్రత్యర్థి కాంగ్రెస్సే : కేటీఆర్
Real Estate | రియల్ ఢమాల్.. సగానికి పడిపోయిన క్రయవిక్రయాలు.. 45 శాతానికి తగ్గిపోయిన ఆదాయం