Harish Rao | హైదరాబాద్ : ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు.. రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. ఈ మేరకు హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా..? అని నిలదీశారు హరీశ్‌రావు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఇందిరమ్మ రాజ్యమా…? ఎమర్జెన్సీ పాలనా?
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.
ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.
ఈ దుర్మార్గాన్ని… pic.twitter.com/aXvinFpkqY
— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులా..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
High Court | హరీశ్‌రావును అరెస్టు చేయవద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
Sanjay Raut | షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు : సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు