KTR | ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులా..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
KTR | ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లనకు తరలిస్తున్నారు.
KTR | హైదరాబాద్ : ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లనకు తరలిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.
ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు..! పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు..! చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు.. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు.. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు.. ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు.. ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు.. చివరకు ప్రజలపై కూడా కేసులు నమోదు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం హింసిస్తుందని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
కేసులు.. కేసులు.. కేసులు.. ఈ పేర్లతో అటు ప్రజలను, ఇటు ప్రతిపక్షాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాసులు మీకు – కేసులు మాకు.. సూటుకేసులు మీకు.. అరెస్టులు మాకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం.. తక్షణం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చివరగా జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ నినదించారు.
ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !
పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !
పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !
గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !
ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !
ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !…
— KTR (@KTRBRS) December 5, 2024
ఇవి కూడా చదవండి..
High Court | హరీశ్‌రావును అరెస్టు చేయవద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. బంజారాహిల్స్ పీఎస్‌కు తరలింపు
Harish Rao | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. హరీశ్ రావు అరెస్ట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

