Rupareddy | ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే..!
Rupareddy | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను హత్య చేసింది ఆమె స్కూల్లో చదివే పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు దర్యాప్తులో తేలింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఈ నెల 11న సాయంత్రం హత్యకు గురయ్యారు.
Rupareddy : ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను హత్య చేసింది ఆమె స్కూల్లో చదివే పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు దర్యాప్తులో తేలింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఈ నెల 11న సాయంత్రం హత్యకు గురయ్యారు. నిందితులు సీసీ కెమెరాలకు చిక్కకుండా, పక్కా ప్లాన్‌తో చేసిన ఈ హత్య కేసును చేధించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఆఖరికి ఆమె స్కూల్లో చదువుకున్న పదో తరగతి విద్యార్థులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తేలింది.
నిందితులు గంజాయికి అలవాటు పడ్డారని, విచ్చలవిడిగా జల్సాలకు చేస్తున్నారని, ఈ క్రమంలోనే డబ్బుల కోసం రూపారెడ్డిని హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ నెల 11న సాయంత్రం ప్రిన్సిపల్ రూపారెడ్డి స్కూల్ ముగించుకొని ఇంటికి రావడానికి ముందే నిందితులు వెనుకవైపు నుంచి గోడదూకి ఇంట్లో చొరబడ్డారు.
ఆమె ఇంటి తాళంతీసి లోపలికి వెళ్లిన సమయంలో ఆమె వాష్‌రూమ్‌లోకి వెళ్లగానే నిందితులు వంటగదిలోకి వెళ్లి దాక్కున్నారు. ఆమె ఫ్రెష్ అయ్యి బెడ్రూమ్లోకి వెళ్లగానే వెనుక నుంచి వెళ్లి కత్తులతో పొడిచారు. మొత్తం 27 సార్లు ఆమెను విచక్షణారహితంగా పొడిచారు. ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల డబ్బును తీసుకుని పారిపోయారు. ఆ డబ్బుతో హైదరాబాద్‌కు వెళ్లి జల్సాలు చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

