హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. తన విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. కాగా, కౌశిక్ రెడ్డి అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అడ్డుకున్నారు. నివాసంలోకి వెల్లడానికి అనుమతించలేదు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొన్నది. ఈ క్రమంలో కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు.
కాగా, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాకేశ్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేలతను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. అదేవిధంగా గోడ దూకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, రాకేష్ రెడ్డి లను అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/XWuY9KS2SP pic.twitter.com/9c5j1s2W3J
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2024