Konda Sushmita : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెట్టిన ఓ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టా స్టోరీలో ఆమె ఒక ఫొటోను షేర్ చేస్తూ దానిపై ‘UPcomming Paraka MLA Konda Sushmita Patel’ అనే టెక్స్ట్ పెట్టారు. ఆ పక్కనే అక్క Akka అని, ఆ తర్వాత Konda Team అని ఉన్నాయి. ఈ ఇన్‌స్టా స్టోరీ వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వచ్చే ఎన్నికల్లో కొండా సుష్మిత పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని ఆమె తండ్రి కొండా మురళి గతంలో ప్రకటించడం, ఇటీవల పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని ప్రకటించడం లాంటి పరిణామాల నేపథ్యంలో కొండా సుష్మిత పోస్టు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవూరీ ప్రకాశ్ రెడ్డినే బరిలో దించనున్నట్లు ప్రకటించినా సుష్మిత తనను కాబోయే ఎమ్మెల్యేగా ప్రకటించుకోవడం స్థానికంగా చర్చకు తెరలేపింది.
కొండా సుష్మితకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం లేదని సీఎం ప్రకటనతో తేలిపోవడంతో.. ఆమె కాంగ్రెస్ రెబెల్‌గా బరిలో దిగుతారా..? లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా పోటీచేస్తారా..? అనే అంశంపై చర్చ జరుగుతోంది.
పరకాలకు కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత!
చర్చనీయాంశంగా కొండా సురేఖ కూతురు ఇన్స్టాగ్రామ్ స్టోరీ
వచ్చే ఎన్నికల్లో కొండా సుష్మిత పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని గతంలో ప్రకటించిన కొండా మురళి
అయితే ఇటీవల పరకాల సభలో వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి… https://t.co/5enL6U14ny pic.twitter.com/vwP8Osp6nR
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026