హైదరాబాద్: కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈక్రమంలో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన గచ్చిబౌలి పోలీసులు.. హరీశ్ రావును అడ్డుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లకుండా గేటు వద్దే ఆపేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాకాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. హరీశ్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసుల బలవంతంగా కారులో ఎక్కించి.. అక్కడి నుంచి తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకున్నది. అనంతరం హరీశ్ రావును కౌశిక్ రెడ్డి నివాసం నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/XvVPSuO6cD pic.twitter.com/gztVnSC0ZW
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2024