జెరుసలాం: ఇరాన్‌పై మళ్లీ దాడి చేసింది ఇజ్రాయెల్(Israel strikes). ఆ దేశ రక్షణ దళాలు ఇవాళ ముందస్తు దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ తెలిపారు. జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో ఆ దాడులు చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం స్థానిక మీడియాలో దాడుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రసారం అయ్యాయి. ఇజ్రాయెల్‌కు శత్రువుగా మారిన కేంద్రాలను తొలగించాలనుకుంటున్నట్లు ఆ దేశం తన స్టేట్మెంట్లో వెల్లడించింది. దీంతో ఇజ్రాయెల్‌లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు మంత్రి చెప్పారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో జరిగిన బాంబుల వర్షం వల్ల ఆ నగరం నుంచి పొగ వ్యాపిస్తున్నది. టెహ్రాన్ ధ్వంసమవుతున్న వీడియోలను కొన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఇజ్రాయిలీ సెక్యూర్టీ దళాలు కీలక ప్రకటన చేశాయి. అమెరికాతో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించినట్లు ఓ ఛానల్ తెలిపింది. ఇరాన్ అధ్యక్ష కేంద్రాన్ని టార్గెట్ చేసినట్లు కొన్ని రిపోర్టులు వెలుబడుతున్నాయి. ఇరానియన్ నేతల ఇండ్లను ఇజ్రాయెల్ తమ దాడుల్లో టార్గెట్ చేస్తున్నట్లు అక్కడి ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
Tehran, #Iran pic.twitter.com/C1qZ1n933E
— Shin (@hey_itsmyturn) February 28, 2026
ఇరాన్ ప్రతిపక్ష నేతలు మెసేజ్ రిలీజ్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త ఆపరేషన్‌కు తమ మద్దతు ప్రకటించారు. ఇజ్రాయెల్ బలమైందని, ఐడీఎఫ్, ఎయిర్ ఫోర్స్ శక్తివంతమైందని, అత్యంత శక్తివంతమైన ప్రపంచ మీకు అండగా ఉందని ఇరాన్ ప్రతిపక్ష నేత యాహిర్ లాపిడ్ తెలిపారు. ఇరాన్ సుప్రీం నేత అయోతుల్లా అలీ ఖమేనీని పారద్రోలే వరకు ఈ పోరాటం ఆగదని అన్నారు.