Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం వియత్నాంలో తన భర్త, ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో కలిసి బేబీమూన్ను ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే తాము మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్న నేపథ్యంలో, ఈ ప్రత్యేకమైన క్షణాలను ఆస్వాదించేందుకు ఈ క్యూట్ కపుల్ వియత్నాం వెకేషన్‌కు వెళ్లారు.
అక్కడి సుందరమైన ప్రదేశాలను చుట్టేయడంతో పాటు, పలు రకాల ఫన్ యాక్టివిటీస్‌లో సమంత ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే అక్కడి ప్రత్యేకమైన స్థానిక ఫుడ్‌ను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలు, ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ బేబీమూన్ పిక్స్ మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.