Eswar Sai Controversy | తెలుగు జానపద పాటల ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ‘బాసింగ బలాలు’ ఫేమ్ ఈశ్వర్ సాయి వ్యక్తిగత జీవితం తీవ్ర వివాదంగా మారింది. తోటి ఫోక్ ఆర్టిస్ట్‌తో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో తన భార్యకు ఈశ్వర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదంపై స్పందించిన ఈశ్వర్ సాయి భార్య శరణ్య తాజాగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన భర్త వివాదంపై ఆమె మాట్లాడుతూ.. “మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతోంది. నా భర్త చాలా మంచివాడు, కనీసం మందు కూడా తాగడు. కానీ ఆ అమ్మాయి కావాలనే ఆయనపై పడి లొంగదీసుకుంది అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆ యువతికి గతంలో బ్రేకప్ అయినప్పుడు తానే దగ్గరుండి ఓదార్చానని, కానీ తన పక్కనే ఉంటూ తననే మోసం చేస్తుందని ఊహించలేకపోయానని వాపోయింది. రోజూ తన కళ్ల ముందే మెరిగిన ఆ అమ్మాయి మంచిదే అనుకున్నానని, అయితే వారి మొబైల్ మెసేజ్‌లు చూసి తాను కంగుతిన్నానని తెలిపారు.ఈ మోసం తలచుకుని తీవ్ర మనోవేదనకు గురయ్యానని, ఒక దశలో తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు ఆమె కన్నీటిపర్యూమంతమయ్యారు. నా భర్త మంచోడే.. కానీ ఒక అమ్మాయి అలా వెంటబడితే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అంటూ ఆమె భర్తను సమర్ధిస్తూనే, ఆ యువతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి అసలు రానివ్వకూడదని ఆమె డిమాండ్ చేసింది. కాగా ‘ప్రమీల’, ‘రాతిరి రాతిరి’ వంటి ప్రముఖ జానపద పాటల్లో కలిసి నటించిన ఈ జోడీ వ్యవహారం ఇప్పుడు ఫోక్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంది
మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త కనీసం మందు కూడా తాగడు
ఈ అమ్మాయికి బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను
నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు
నా కళ్ల ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ మెసేజ్‌లు చూసి… https://t.co/LYMjCGNmQL pic.twitter.com/dAaYN5Qka7
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026