న్యూఢిల్లీ : వారానికి ఐదు రోజుల పని విధానాన్ని డిమాండ్ చేస్తూ అన్ని బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతున్నారు. డిప్యూటీ లేబర్ కమిషనర్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకు ఉద్యోగుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని.. ఐదు రోజుల పనివిధానం కూడా పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది.
కానీ ఈ మాటతో యూఎఫ్‌బీయూ ఏకీభవించలేదు. ఐదు రోజుల పనివిధానం అమలు దిశగా చర్యలు కనిపిస్తేనే సమ్మె విరమిస్తామని తెలిపింది. సమ్మెకు ముందు శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు తెరుచుకోవు. దీంతో మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.