కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దుర్భరం
బీఆర్ఎస్ హయాంలో రైతులకు సమయానికి నీళ్లు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ పథకాలు సకాలంలో అందాయని, నేడు కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేకుండా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఆరోపించారు.
- మాజీ ఎమ్మెల్యే బిగాల ఫైర్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో రైతులకు సమయానికి నీళ్లు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ పథకాలు సకాలంలో అందాయని, నేడు కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేకుండా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఆరోపించారు. నేడు అన్నదాతల పరిస్థితి ‘నీళ్లు ఇస్తారా? లేక విషం తాగి చావాలా? అనే స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
మొన్నటి వరకు ఎరువుల విషయంలో ఇదే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం’ బాగుపడినట్టు చరిత్రలో లేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ మాని రైతులకు ఎరువులు, పంట పెట్టుబడి, సాగునీరు, 24 గంటల విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

