Harish Rao | హైదరాబాద్ : విద్యాశాఖలో పని చేస్తున్నసమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లైనా ఉండటం లేదు అని ఆయన పేర్కొన్నారు.
చాయ్ తాగే లోపు జీవో ఇచ్చి మీ ముఖాల్లో సంతోషం చూడొచ్చు అని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను హరీశ్‌రావు ఎక్స్ వేదికగా దానికి సంబంధించిన వీడియోను విడుదల చేసి గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా మీకు ఆ చాయ్ తాగే సమయం ఎందుకు దొరకడం లేదో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నాని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినదించిన సోదరి సీతక్క కూడా వారు చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నాను. ఎన్నికల సమయంలో చెప్పిన మీ మాటలకు విలువ లేదా..? ఎన్నికల సమయంలో ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఒకలాగా వ్యవహరిస్తారా.? ఇప్పటికైనా స్పందించి, ఎన్నికల హామీ ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
విద్యాశాఖలో పని చేస్తున్నసమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.
ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లైనా ఉండటం లేదు.
చాయ్ తాగే లోపు జీవో ఇచ్చి మీ ముఖాల్లో సంతోషం చూడొచ్చు అని ఎన్నికల… pic.twitter.com/tLwZKJY7Wn
— Harish Rao Thanneeru (@BRSHarish) August 1, 2024
ఇవి కూడా చదవండి..