Harish Rao | నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నావ్.. రేవంత్‌కు హరీశ్‌రావు చురకలు
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి.. తనకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు అని స్పష్టం చేశారు.
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి.. తనకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు అని స్పష్టం చేశారు.
నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీఆర్ఎస్లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు అని రేవంత్‌కు హరీశ్‌రావు చురకలంటించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నక్కినక్కి చూశావు. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు అంటూ రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.
పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డిపోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్‌గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నావు అంటూ రేవంత్‌పై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు.
శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు.
నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని… pic.twitter.com/uiU6hqDSPi
— Harish Rao Thanneeru (@BRSHarish) August 1, 2024
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

