Y Satish Reddy | ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపేది లేదు : వై సతీష్ రెడ్డి
Y Satish Reddy | తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ అక్రమం అని మండిపడ్డారు.
Y Satish Reddy | హైదరాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ అక్రమం అని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ తప్పులను ఎండగడుతున్నందుకే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తున్నారు. పది నెలల్లో వందలకు పైగా కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా, దాడులు చేసినా, జైలుకు పంపినా… ఏ ఒక్కరు కూడా సర్కార్‌ను ప్రశ్నించడం మానడం లేదు. నిఖార్సైన తెలంగాణ బిడ్డలు పుట్టిన నేల కోసం తెగించి కొట్లాడుతూనే ఉంటారు. కొణతం దిలీప్ కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. గతంలోనూ అరెస్ట్ చేసి రోజంతా స్టేషన్లో పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారు. అనేక అక్రమ కేసులు పెట్టారు. చివరకు కోర్టు ఆదేశాలతో ఓ కేసులో పోలీసు విచారణకు హాజరయ్యేందుకు వెళితే ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య. వెంటనే ఆయనను విడుదల చేయకపోతే సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర బాగుకోసం వాడాల్సిన అధికారాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం వాడుతోంది. ఈ పద్దతి మార్చుకోవాలని వై సతీష్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Konatham Dileep | కొణతం దిలీప్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు
Harish Rao | కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తాడు.. రాబోయే రోజుల్లో కప్ మనదే : హరీశ్‌రావు
Harish Rao | ఆరు గ్యారెంటీల అమల్లో రేవంత్ రెడ్డి డకౌట్.. విమర్శించిన హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

