RSP | హైదరాబాద్ : గురుకులాల్లో చదువుతున్న పేద పిల్లల సంక్షేమం, రక్షణపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పది రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు బలికావడం, మరో ఇద్దరు వెంటిలేటర్‌పై ఉండడం చూస్తే తెలంగాణలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లల సంక్షేమం ఎవరికీ పట్టనట్టుగా ఉంది. కనీసం అక్కడ డ్యూటీ నర్సులు కూడా లేకపోవడం అంటే మా పేద పిల్లల ప్రాణాలకు రక్షణ లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేవలం హైదరాబాద్‌లోని పబ్లిక్, ఇంటర్నేషనల్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల ప్రాణాలే ముఖ్యమా..? మా పేద పిల్లలవి ప్రాణాలు కావా? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. పాములు, తేళ్లు, పందికొక్కులు డార్మిటరీలకు రాకుండా రిపేర్లు చేయడానికి ఎన్ని నిధులు మంజూరు చేశారు? ఎన్ని ఖర్చు పెట్టారు..? అని అడిగారు. పిల్లలు ఫ్లోర్ మీద పండుకుంటే పాములు కాటువేస్తాయని డబుల్ మంచాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? అని ఆర్ఎస్పీ నిలదీశారు.
గురుకులాలకు, హాస్టళ్లకు పక్కా భవనాలు ఎప్పుడొస్తయి? ఇప్పుడు ఎంత డబ్బు కేటాయించారు..? అణచివేయబడ్డ, వెనకకు నెట్టివేయబడ్డ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు ముఖ్యమంత్రిని నిలదీయడం లేదు? మీకు పదవులే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా?? ఎస్సీ, ఎస్టీ, బీసీ మానవ హక్కుల కమిషన్లు ఎందుకు మూగబోయాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పది రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు బలికావడం, మరో ఇద్దరు వెంటిలేటర్ పై ఉండడం చూస్తే తెలంగాణలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లల సంక్షేమం ఎవ్వరికి పట్టనట్టు గా ఉంది. కనీసం అక్కడ డ్యూటీ నర్సులు కూడా లేకపోవడం అంటే మా పేద…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 10, 2024
ఇవి కూడా చదవండి..
TGSRTC | మహిళలకు శుభవార్త.. ఆర్టీసీ కార్గోలో రాఖీలు.. 24 గంటల్లో చేరేలా చర్యలు
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
Karimnagar | మెట్పల్లిలో పోలీసుల అత్యుత్సాహం.. మహిళపై లాఠీ ఝులిపించారు.. వీడియో