Karimnagar | కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పరిధిలోని మెట్పల్లి పోలీసు స్టేషన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గొడవ పడ్డ ఓ దంపతులిద్దరూ మెట్పల్లి పోలీసు స్టేషన్కు వచ్చారు. పోలీసు స్టేషన్ ఎదుటనే భార్యాభర్తలిద్దరూ మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఏఎస్ఐ ఆంజనేయులు, ఓ హెడ్ కానిస్టేబుల్.. ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు. ఇక వారిద్దరిని విడిపించే క్రమంలో ఇద్దరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏఎస్ఐ ఆంజనేయులు.. మహిళపై లాఠీ ఝులిపించారు. లాఠీతో కొడుతూ.. ఆమెను భయపెట్టిస్తూ పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి తరిమేశాడు ఏఎస్ఐ. హెడ్ కానిస్టేబుల్ కూడా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళపై చేయి చేసుకున్న ఇద్దరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
జనగామలో న్యాయవాద దంపతులపై సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై తిరుపతి, తదితర పోలీసు సిబ్బంది కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే. వీరిని బదిలీ చేసి చేతులు దులుపుకోకుండా బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
పోలీస్ స్టేషన్ ముందే మహిళను లాఠీతో కొట్టిన పోలీస్
కరీంనగర్ – మెట్ పల్లిలో గొడవ పడి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన భార్యభర్తలు.. భర్తతో గొడవపడిన మహిళను లాఠీతో కొట్టిన పోలీసులు
ఇది గమనించిన ASI ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ గొడవను ఆపడానికి వచ్చి మహిళను లాఠీతో కొట్టి ఆమెపై చేయి… pic.twitter.com/DHNsSafBx9
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2024
ఇవి కూడా చదవండి..
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద
Runa Mafi | ఒకే మండలంలో 1200 మంది రైతులకు రుణమాఫీ కాలే.. అధికారులపై ఎమ్మెల్యే కడియం ఆగ్రహం
TGSRTC | ఆందోళనలకు సిద్ధం.. ఆర్టీసీ కార్మికులకు 200కోట్ల బాండ్ల బకాయి